ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం?
జానెడు కాగితంపై, రెండు అక్షరాల్లో
నిలువెత్తు నీఅందాన్ని ఊహిస్తూ..
మన జీవితమంతా కొద్దికొద్దిగా
ప్రతిక్షణం, తనివితీరా..
అనుభవించాలన్న,
నీతో పంచుకోవాలన్న
అనంతమైన నా ప్రేమను..
బంధించి, రెండు క్షణాలలో
వ్యక్తీకరించాలన్న నా తాపత్రయం.. ?
అందుకే..
నీకు చెప్పను, నీకు తెలియనివ్వను,
నిరంతరం, కొంచం కొంచం..
నేనే నాతో నా నిన్ను పంచుకుంటాను..
ఈ నీ, నా అనంతాన్ని..
No comments:
Post a Comment