Wednesday, April 14, 2021

కృతజ్ఞతలు తెలుపుకునే రోజు...

అమెరికాలో ప్రతిసంవత్సరం కృతజ్ఞతలు తెలుపుకునే రోజు జరుపుకుంటారు...

ఆకాశమంత ప్రేమ అతనిది ఐతే..
అక్కడినుంచి కురిసే ప్రతి వానచినుకులో
ఆ ప్రేమను ఒక్కక్కటిగా అనుభవించాలంటే
కావలిసినన్ని జన్మలెత్తాలనీ...
ఎత్తిన ప్రతిజన్మలోనూ అతనే
మా నాన్న కావాలనీ అనిపిస్తుంది...

ఎంత స్వార్థం నాది?
అలా నిజంగానే జెన్మలెత్తితే..
అప్పుడుకూడా ఇలానే అతను
కురిపించే ప్రేమ...
మరిన్ని ఆకాశాల్ని నింపేస్తుందో..
ఆ ప్రేమను గ్రోలటానికి
ఇంకా ఇంకా చాలా జన్మలకీ
కొడుకుగానే పుడతానుగా..


నేనే ఆ నేనే

నేనే ఆ నేనే
నీ ఊహల అంచులలో కూడా నిలువలేని, నోచుకోని
ఆ నేనే
అప్పుడెపుడో నీవు విడిచిన నిశ్వాసపు శ్వాసనద్దుకుని
ఆ పరిమళాన్ని కొద్దికొద్దిగా... క్రొంగొత్తగా... ఆస్వాదిస్తూ,
నిరంతరం, నా ఆలోచనల్లోని నా నిన్ను,
ఎప్పటికీ కోల్పోకుండా...దాచుకున్న ఆ నువ్వు,
నా నువ్వే... నీకు తెలియని నా నువ్వే...


తీరని కోరిక

 ఉదయించాలని కోరుకోని ఈ రేయి నిండా ఊసులే..

తీరాలని కోరుకోని ఆశలే..

తీరిన కోరిక తీరంలో ఇంకిన కెరటం లాంటిది..

మరణంలో కరిగిన జీవంలాంటిది...

దాని అస్తిత్వంకోల్పోతుంది..

తీరని కోరికలో ఎప్పటికీ తాజాతానం ఉంటుంది 

ముక్కెర

 ఆ ముక్కుపుడకిచ్చెయ్యరాదూ..

ముక్కునుంచి తీసెయ్యకుండా... ఆ ముక్కుని మురిపెంగా చూస్తున్న కళ్లుకూడా వొచ్చేస్తాయేమో.. ఆ ముక్కుని మోస్తున్న పెదాలుకూడా తోడుంటాయేమో.. చీకటితో చెప్పకుండా.. అచ్ఛికబుచ్చికాలాడేసుకుంటా..

నేను, నా అభిమతాన్ని నిర్వచించే , నా సినిమాలు,

 నాకు 15-30 నిముషాలకంటే ఏ వినోదం కోసమైనా సమయం వెచ్చించటం ఇష్టపడదు. 

అందుకేనేమో అంతగా సినిమాలు చూడను.

అందులోనూ నిజ జీవితంలోని డ్రామా అస్సలు నచ్చదు.. నిజం నచ్చుతుంది.. ప్రాక్టీకాలిటీ నచ్చుతుంది...

కానీ కొన్ని సినిమాలు మాత్రం పూర్తిగా చూడాలనిపించేది.. అవ్వి..

సంకీర్తన, ఆనంద్, హ్యాపీ డేస్, చందమామ కధలు, c/o కంచరపాలెం.. ఇలా..

ఏవిటో ఈ ఇష్టాలు నా అభిమతాన్ని ఎలా నిర్వచిస్తాయో తెలీదు.. 

మీకేమైనా అంచనా ఉంటే చెప్పండి..