Saturday, September 29, 2018
భావ సందేశం
ఆకుపచ్చని లోయలో పరచిన
పట్టుపరికినీ మీంచి నడిచి వెళ్లినంత
నాజూగ్గా ఉంటావు...
నిన్ను ప్రేమించినంతసేపూ
నీలి సరోవరాల కౌగిలింత
గుర్తొస్తుంది నాకు
రాత్రికి రాత్రి రహస్యంగా వొచ్చి
భూదేవిని ముద్దాడుకునే
దొంగవానలా..
దోబూచులాడే నీ నవ్వు ..
డాబామీంచి జారిన సన్నజాజి తీగె
పూలు రాలుస్తున్న ధ్వని
ఆ నవ్వు నిండా..
ఎన్నటికీ పూర్తికాని అసంపూర్ణ చిత్రం లా
ఆ మునివేళ్లమీద నిలబడి,
ద్విచ్చక్రానికి అతికించే
మువ్వగోపాల పదంలాంటి
విరిచూపులంటే
ఎంత మొహం? ఎంత ధ్యానం ?
ఆ ఒక్క క్షణం ,
వంతెన కింద ప్రవహిస్తున్న నీటి సవ్వడిలా
మాట్లాడిన మాటలన్నీ
నయన మందారాల్ని పుష్పింపజేశాయి
లేలేత పెదవి అంచునుంచి
దూకుడుగా జారిన నయగారాలాంటి
పాటనిండా ... ఓ... మార్మిక సౌందర్యం ఒదిగిపోయి,
ఒక నువ్వు,
ఒక నేను...
చెరిసగం.. ప్రవాహంలా మారినపుడు...
అతిపురాతన శరీరాలను
సరికొత్త కాంక్షాదీపం వెలిగిస్తుంది...
Sunday, September 23, 2018
Saturday, September 22, 2018
గులాబీ
నా మనసు పూదోటలో...
నీ ప్రేమ గులాబీ పుష్పించే వేళ కోసం
ఎన్నో నీ.. ఊసుల
నిశిరాత్రులలో..
నిను చూస్తూ
కూర్చుంటాను..,
నీ దయ..!
రాలిపడే.. ఒక హిమబిందువై...
నా ప్రేమ పుష్పాన్ని తాకి,
నిను చేరి మురుస్తుందని ,
నీ ఊసుల
నిశిరాత్రులలో ..
నిను చూస్తూ కూర్చుంటాను...
నీ ప్రేమ గులాబీ పుష్పించే వేళ కోసం
ఎన్నో నీ.. ఊసుల
నిశిరాత్రులలో..
నిను చూస్తూ
కూర్చుంటాను..,
నీ దయ..!
రాలిపడే.. ఒక హిమబిందువై...
నా ప్రేమ పుష్పాన్ని తాకి,
నిను చేరి మురుస్తుందని ,
నీ ఊసుల
నిశిరాత్రులలో ..
నిను చూస్తూ కూర్చుంటాను...
Friday, September 14, 2018
ప్రార్థన
చల్లని మంచు బిందువుల వర్షంలో
నీ అర్చనకై సంతోషంతో
విచ్చుకున్న సుమాన్ని నేను..
నీ ఉచ్వాసంతో కలసి,
నీ హృదయ మందిరాన నా పరిమళాన్ని వెదజల్లి,
అక్కడే ఉండాలని ఆశించినా,
నీ నిశ్వాసం ద్వారా బయటకు పంపేయాలని
ప్రయత్నిస్తున్నావు..
నీ ప్రేమ రాగమాలికలో నేనొక
స్వరమాధురినై పులకరించాలనీ,
నా జన్మ తరించాలనీ ఆశ ...
కానీ...
ఎవరు నన్ను కోసి, నీ సేవకు
నోచుకోకుండా చేస్తారో అని
నా బాధ....!
అందుకే...
ఆకుల చాటున...
ఎవ్వరి కంటా పడకుండా...
నీకోసం ఎదురుచూసి,
ఎండలో వడలిపోయాను
సాయంత్రానికి నీ దరి చేరలేక,
బాధాతప్త హృదయంతో..
నేల రాలాను...
కనీసం నీ సుతిమెత్తని
పాదాలకిందైనా...నలిగి,
నా జన్మ సార్ధకం కావాలని,
ఆశగా ఎదురుచూస్తూ...
నిన్నందుకోవాలని
పడే ఆరాటాన్ని తెలుపలేని..
మూగ జీవిని...
కానీ...
అంతలో హోరుగాలి
నన్ను ఎక్కడికో తీసుకుపోయి,
నన్ను విచ్ఛిన్నం చేస్తుందని భయం...
మరు జన్మకైనా...
నన్ను,
నీ పాదాలను ముద్దాడే..
మంత్రపుష్పం కానివ్వు...
నీ అర్చనకై సంతోషంతో
విచ్చుకున్న సుమాన్ని నేను..
నీ ఉచ్వాసంతో కలసి,
నీ హృదయ మందిరాన నా పరిమళాన్ని వెదజల్లి,
అక్కడే ఉండాలని ఆశించినా,
నీ నిశ్వాసం ద్వారా బయటకు పంపేయాలని
ప్రయత్నిస్తున్నావు..
నీ ప్రేమ రాగమాలికలో నేనొక
స్వరమాధురినై పులకరించాలనీ,
నా జన్మ తరించాలనీ ఆశ ...
కానీ...
ఎవరు నన్ను కోసి, నీ సేవకు
నోచుకోకుండా చేస్తారో అని
నా బాధ....!
అందుకే...
ఆకుల చాటున...
ఎవ్వరి కంటా పడకుండా...
నీకోసం ఎదురుచూసి,
ఎండలో వడలిపోయాను
సాయంత్రానికి నీ దరి చేరలేక,
బాధాతప్త హృదయంతో..
నేల రాలాను...
కనీసం నీ సుతిమెత్తని
పాదాలకిందైనా...నలిగి,
నా జన్మ సార్ధకం కావాలని,
ఆశగా ఎదురుచూస్తూ...
నిన్నందుకోవాలని
పడే ఆరాటాన్ని తెలుపలేని..
మూగ జీవిని...
కానీ...
అంతలో హోరుగాలి
నన్ను ఎక్కడికో తీసుకుపోయి,
నన్ను విచ్ఛిన్నం చేస్తుందని భయం...
మరు జన్మకైనా...
నన్ను,
నీ పాదాలను ముద్దాడే..
మంత్రపుష్పం కానివ్వు...
ఎక్కడో...
ఎక్కడో ఉన్న నీవు...
హఠాత్తుగా గుర్తుకొస్తావు...!
నా మనసంతా
ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది ...
నిను తలచుకుంటే...
మనసు మధన పడుతుంది...
కనులు చెదురుతాయి!
నా పెదవులు నీ స్మరణగీతాన్ని
ఆలపిస్తాయి!
నా మనసేమో నీ గురించి...
అందమైన అల్లికలు
వల్లిస్తూంటే ..
నేనసలు..
ఈ లోకంలోనే ఉండను ..!
ఎక్కడెక్కడో, మరో లోకాల్లో..
నీ గురించి, నీ నవ్వుగురించీ ...
వెదుకుతూంటాను...!
నీ వూహ వొస్తే...
మనసు పులకరిస్తుంది ..!
నిను చేరుకోవాలనే తపన,
దానికోసం ఎదో చెయ్యనే ఆరాటం..
కానీ, ఎలా సాధ్యం?
నీకూ నాకూ మధ్య..
ఏడు సంద్రాల దూరం...
అయినా.. మన మనసుల మధ్య...
అరంగుళం కూడా
దూరం లేదు..
హఠాత్తుగా గుర్తుకొస్తావు...!
నా మనసంతా
ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది ...
నిను తలచుకుంటే...
మనసు మధన పడుతుంది...
కనులు చెదురుతాయి!
నా పెదవులు నీ స్మరణగీతాన్ని
ఆలపిస్తాయి!
నా మనసేమో నీ గురించి...
అందమైన అల్లికలు
వల్లిస్తూంటే ..
నేనసలు..
ఈ లోకంలోనే ఉండను ..!
ఎక్కడెక్కడో, మరో లోకాల్లో..
నీ గురించి, నీ నవ్వుగురించీ ...
వెదుకుతూంటాను...!
నీ వూహ వొస్తే...
మనసు పులకరిస్తుంది ..!
నిను చేరుకోవాలనే తపన,
దానికోసం ఎదో చెయ్యనే ఆరాటం..
కానీ, ఎలా సాధ్యం?
నీకూ నాకూ మధ్య..
ఏడు సంద్రాల దూరం...
అయినా.. మన మనసుల మధ్య...
అరంగుళం కూడా
దూరం లేదు..
వెన్నెల పరిచయం
తెల్లకాగితాలు, పాళీపెన్ను తీసుకుని ఎదో రాసుకుందాం అని ఆ గది లో కూర్చున్నా..
గది అంటే గదే అనుకునేరు..
నా మదిలాంటి ఎల్లలు లేని పార్క్ , పచ్చిక పరచుకుంది,
ఆ పార్క్ లో ఒక మూల..
"ఏం చేస్తున్నారు?" మొదటి కాగితం మీద ఏవో కొన్ని వాఖ్యాలు రాస్తుంటే..
సన్నగా వినిపించింది.. నా నిశ్శబ్దాన్ని రవళిస్తూ .. ,
మది నిండా ఊహలున్నా .. మూగబోయిన మృదు వేణువుకు..
పెదవి అంచున జాలువారిన కన్నె ఊపిరి ప్రాణమైనట్టు...
"మునివేళ్లతో కలలు కంటున్నాను" .... వెన్నెల ముచ్చటగా నవ్వుకుంటూ ఎదురుగా కూర్చుంది...
ఆమె పేరు ఏదన్నా కావొచ్చు.. నాకు మాత్రం వెన్నెల.. , అంత మనోహరంగా ఉంటుంది..
"మీరెప్పుడూ ఇలానే మాట్లాడతారా?" .. ఆ కనీ కనిపించకుండా.. మాయమయ్యే చిరునవ్వుని.. మరలా ప్రసాదిస్తూ...
"అవును.. మాటలకు రెక్కలుకట్టి ఎగరేస్తాను" నా కాగితం వైపు నేను చూసుకుంటూ.., మనసు మాత్రం ఆమెనే చూస్తోంది..
"ఏవిటీ? చిన్నపిల్లలు గాలిపటాలు ఎగురవేసినట్టా?" - పెదవులమీది చిరునవ్వు పంచిన ఊపిరి ఆవిరి కళ్ళల్లో చూపిస్తూ..
"గాలిపటాలు తిరిగొస్తాయి... నా మాటలకు అలంటి బాధ్యతలుండవు..!" ఇంకా కాగితం మీదే ఆమెని వెదుకుతున్న నా కళ్ళను తీసి ఆమె వొళ్ళో పెట్టాలనుకునేలా ...
"మీ మాటలు నాకు సగమే అర్థమవుతాయి, అయినా వినాలనిపిస్తుంది.. ఎందుకంటారు?" ఆమె కళ్ళు నా కాగితం మీద అప్పటికే నేను రాసుకున్న ముత్యాలను ఆర్తిగా వెతికేస్తున్నాయని తెలుస్తోంది..
"వెన్నెల ఎప్పుడూ భూమిని సగమే చూస్తుంది." ఆమెకి తెలీదు ఆమె కి నేను పెట్టుకున్న పేరు వెన్నెల అని.
"ఇంతకీ ఏమిరాసారో కవిగారు?" వెండి గిన్నెలో కలిపిన పాలబువ్వలా.. చిరునవ్వుకు చిలిపిదనం కలిపి, మొదటి కాగితం తియ్యబోయింది.. అతి కష్టంగా కాగితం మీదే ఇంకా నిలిపిన నా కళ్ళకు తన మృదువైన వేళ్ళ నాజూకుతనం తళుక్కున మెరిసింది..
"అక్షరాలను.. తీగమీద కూర్చున్న.. పాలపిట్టల్లా పొదిగాను... చదవకు... ప్రేమతో నిమరు".. ఇంకా ఆ వేళ్లవైపే చూస్తూ...
ఆమె నిర్మలంగా నావైపు చూసింది.. ఇక నా కళ్ళు, ధైర్యం అంతా కూడగట్టుకుని ఆమె వైపు తిరిగాయి.. ఇంకా కష్టపడి ..
"అదిగో! అలాంటిమాటలే నాకు ఇష్టం... ఎలా వొస్తున్నాయి మీకు?" నా కళ్ళనిండా పండువెన్నెల కురుస్తోంది... నిర్విరామంగా...
ఆమె కి ఎలా చెప్పాలి?
వెన్నెల చూస్తోన్న చూపుల్నే కాదు,
మాటల్ని కూడా మార్చేస్తుందని..
వెన్నెట్లో.. కన్నీటి బిందువులు కూడా నవ్వుతాయని?
సన్నజాజులు కూడా అలాంటివే..
చీకటి కురుల్లో నవ్వులు తురుముకోవటం కన్నా అనుభూతి ఏం ఉంటుంది?
ఇవన్నీ చెప్పలేను, భయం...
భయాన్ని ఏకొద్దిగానో పక్కనపెట్టి,
పైకి చెప్పినమాటలకే.. నా వెన్నెల మురిసిపోతోంది..
ఇక పూర్తిగా మాటాడగలిగితే....?
"తెల్లారటం మామూలే
అందరితో పాటు నేనూ నిద్ర లేస్తాను...
వెన్నెల రావటమే ముచ్చట..!!
అందరూ నిద్రించేటపుడు
నేనొక్కడినే మేల్కొంటాను...
పొద్దు మాటకారి,
వెన్నెల పరమ మౌని..!!!"
ఆమె చదివింది...
ఆగి, ఆగి, నా వైపు చూస్తూ..
"ఇది కూడా సగమే అర్థమయ్యింది, ఐనా నచ్చింది.." అని తన మృదువైన వేళ్ళతో నాకిచ్చేసింది..
కాగితం తీసుకుని, మునివేళ్ళని నాకిచ్చేస్తుందననుకున్నాను .. కానీ నిరాశే...
"ఏవిటీ? కళ్ళు అలా ఎర్రగా ఉన్నాయి?" ఆత్రంగా అడిగింది వెన్నెల..
"ఆహా ఏమీ లేదు, కాస్త జలుబు చేసింది, సీజన్ చేంజ్ కదా.. మామూలే.." కంటిలోని చెంగలువలు వెన్నెలకోసం ఎదురుచూస్తున్నాయి ఇన్నాళ్లూ.... అని ఎలా చెప్పను?
"అయ్యో అలాగా.. జ్వరం అదీ ఉందా?" అర చేతినిండా ప్రేమను నా నుదిటిమీద ఉంచింది..
"కొంచం ఏమిటి ? కాలిపోతోంది.." వెన్నెల నా శరీరమంతా ప్రవహించింది.. బహుశా జ్వరం తగ్గిపోయి ఉండాలి.. ఇంకాస్త జ్వరం వొస్తే బాగుణ్ణు, అరచేయి మరికాసేపు వుణ్ణేమో ..
"ఏయ్ ఇక్కడ ఉన్నావా? కౌంటర్ క్లోజ్ చేసేస్తారు టైం అయిపోతోంది పదా.." వెన్నెల స్నేహితులనుకుంటా ఎండను మోసుకొచ్చారు...
కలం కదిలితే ఒట్టు ... మల్లెపూవులాంటి తెల్ల చీర కట్టుకున్న సన్నజాజి నా కళ్ళముందునుంచే కదిలి వెళ్ళిపోయింది...
సాయంత్రం అయింది.. ఎలాగోలా ఇంటికి చేరుకున్నా..
కాస్త చీకటి పడ్డాక చిరుజల్లులు మొదలయ్యాయి...
మేఘాలు కమ్ముమున్న ఆకాశం కూడా వెన్నెల్ని దాచేసింది..కానీ వెన్నెల ఊహలు మనసుని కమ్మేస్తున్నాయి...
మళ్ళా ఇందాక మధ్యలో ఆపేసిన కాగితాలు, కలం తీసాను ...
ఎక్కడో మువ్వల చప్పుడు,
రిక్షాకి మువ్వలు కట్టారెవరో...
తనజాడ సంగీతాబద్దంగా తెలియటానికి...
పక్కింటివాళ్ళు సినిమా నుంచి వొచ్చినట్టున్నారు అనుకున్నాను..
కానీ ఒక చిన్న కల... "ఈ వేళప్పుడు నా వెన్నెల వొస్తే ఎంతబాగున్ను.." ....మేఘావృతమైన ఆకాశం ఎదురుగా ఉంటే.. వెన్నెలేం కురుస్తుంది?... అనుకుంటూనే తలుపు తీశాను....
వెన్నెలే...!! పండువెన్నెలే ...!! కురుస్తోంది గుమ్మం ముందు ...
"లోపలికి రా,.. వర్షం పడుతోంది... " వెన్నెల వర్షం లో తడిచిపోతోంది...
"జ్వరం కదా.. కాస్త చారు, అన్నం తెచ్చాను.. వేడి గా తింటే తగ్గుతుంది..."లోపలి వొచ్చి, చీర కొంగులో దాచిన సంచిలో కారియర్ ని బయటకు తీసి టేబుల్ మీద పెట్టింది.
"సర్లే తింటాను..."...వెన్నెల్లో అమ్మ కనిపించింది....
ఆ సంచిలోచే.. టీ తీసి ఓ కప్పులో పోసి నాకిచ్చింది..
అప్పటికే.. నేను నాకాగితాలు, కలం పట్టుకుని, వరండా చివర మీది మెట్టుమీద కాలు పెట్టి కూర్చున్నాను..
చినుకుల వల్ల తడిచిన వెన్నెల భుజాల నిండా చీర కొంగు కప్పుకుని, మరో కప్పు టీ తో నా పక్కనే కూర్చుంది...
మా ఇద్దరి పాదాలూ వాన చినుకుల తుంపర్లలో కొద్ది కొద్దిగా తడుస్తూన్నాయి.. మా ఇద్దరి మనసులూ ఒకరికి తెలియకుండా ఒకరికి.. బరువెక్కుతున్నట్టు...
ఆమె ఏవేవో చెప్తోంది.. ఆకాశంలో మేఘాలున్నా.. నా మనసు నిండా వెన్నెల కురుస్తోంది...

Wednesday, September 12, 2018
ఎర్ర పరికిణీ...
నేను కింద రాసిన నా "మోటారు సైకిల్ కధ" మళ్ళా చదువుతుంటే ఎందుకో ఇదివరకు జరిగిన సరిగ్గా అలాంటి సందర్భమే గుర్తుకొచ్చింది...
ఏవిటో బుద్దుడికి బొధి చెట్టుకింద జ్ఞానోదయం అయినట్టు.. నాకుకూడా చెట్లకిందే కలలొస్తాయేమో...
అవి నేను వైజాగ్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న రోజులు..
ఆసీల్మెట్ట జుంక్షన్ దగ్గర ఒక మెస్ (హోటల్) లో రోజూ మధ్యాహ్నం భోజనం చేసేవాడిని..
తెల్లారే 7కల్లా క్లాసులు స్టార్ట్ అయ్యేవి.. బ్రేక్ ఫాస్ట్ అనేది నామమాత్రం..
మధ్యాహ్నం రెండుగంటల వరకు క్లాసులు అయ్యేవి.. కడుపులో ఎలుకలాట నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్ల లెవెల్లో సాగేది..
తొందరగా రాంనగర్ నుంచి వాల్తేర్ అప్ ల్యాండ్స్ గుండా నడుచుకుంటూ వొచ్చేవాడిని..
అక్కడ ఆసీల్ మెట్ట జుంక్షన్లో మణికంఠ బేకరీ కి ఎదురుగా రోడ్డుకి అవతలపక్క కిట్-కేట్ అనే ఒక restaurent ఉండేది.. అదేదో రాముడి పర్ణశాల లా వెదురు బొంగులతో, రెల్లుగడ్డి పరిచి..అదేదో నేను చిన్నప్పుడు చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ లా ఉండేది.. కానీ తర్వాత తెలిసింది.. అది బాగా డబ్బున్న మారాజులకు మాత్రమే అని. నేను వెళ్లే దారి ఆ restaurent పక్కనుంచే ఉండేది.. అక్కడ ఒక చెట్టుకింద ఒక ఎర్రటి మారుతీ కారు (అప్పట్లో అది మారుతి 800 అనుకుంటా) రోజూ ఆగి సేదతీరుతూ ఉండేది. దాని పక్కనుంచే వెళ్తుంటే.. అప్పుడే కోవెలలోనుంచి బయటకు వొచ్చిన పదహారణాల పరికిణీ లా ఉండేది.. ఎవరన్నా చూస్తున్నారేమో అని, అటు, ఇటు చూసి, కాసేపు అద్దాలమీద, మూతిమీద, కళ్ళమీద తడిమేసేవాడిని..
అలా రోజూ జరిగే రొమాన్స్.. చివరికి.. నాక్కూడా ఇలాంటి ముద్దులాడి కావాలి , ఎప్పటికన్నా కొనగలనా అనిపించేది...
అలా ఆ వేసవి సరసం ముగిశాక.. ఆ పరికిణీ చాలారోజులు గుర్తొస్తూనే ఉండేది... అమెరికా వొచ్చాక.. కాస్త ముదురు పరికిణీలే కొనుక్కున్నాననుకోండి... కానీ అప్పటి ఆ ఎర్ర పరికిణీ కలే అందంగా ఉంటుంది.. ఎప్పటికీ...

అమృత ఘడియలు...
నేను రాసేది అంతా కవిత్వం అని ఒకరెవరో అన్నారు...
ఆహా అది కవిత్వం అదీ కాదు..
జీవనగమనంలో నాకు పరిచయమైన క్షణాల్లో
నేనేరుకున్న అమృత ఘడియలు...
అందరికీ అన్నీ దొరుకుతాయి...
ఎవరికి ఇష్టమైనవి వాళ్ళేరుకుంటారు.. ,
నాకిష్టమైన క్షణాలను.. నేనేరుకుంటున్నా...
ఏరి, దండ కూర్చి, మాటల మాలలల్లుకుంటున్నా...
ఇంత సుందరమైన బతుకునిచ్చిన భగవంతుని అర్చనకు సమర్పించేందుకు...
అందులో కొన్ని అందంగా ఉండొచ్చు,
మరికొన్ని పరిమళించొచ్చు ..
ఇంకొన్ని మిమ్మల్ని అలరించవొచ్చు.....
కొండొకచో కలవరింతాపెట్టొచ్చు,
కాసేపు విసిగించావొచ్చు...
....అందులో కాసిన్ని గురుతుల్ని మీరు కూడా పంచి ఉండవొచ్చు

Sunday, September 9, 2018
వెన్నెల్లో నీ తోడు...
వెన్నెల్లో నీతోడు పరిచయం చేసిన వెచ్చదనం,
ఎండల్లో నీ గుర్తు నేర్పిన మంచుదనం…
వానల్లో నీ ఊసు పంచిన చిలిపిదనం..
రాత్రుల్లో నీ మేని పంచిన పరిమళం…
తెల్లారే… నీ మోము చూపిన అందం…
గుర్తొచ్చిన ప్రతినిముషం… అది బతుకున పర్వదినం …
Friday, September 7, 2018
Shhhh.... Dream on....
Shhhh...., have no more words,
Come over and sleep on my lap,
Caring you like the lashes on the Eye,
Singing... for you to turn into a Dream.
Like the feathers of a Peacock, my fingers will brace over you.
The Unspoken Conversations that will happen, will be with us forever.....
As my tears are struggling to stay within my eye lids,
saving the droplets, my Eyes now resemble a ocean.
Even when I forget, not a day goes by without remembering you.
Even if I take leave off you, that feel of mine... is everlasting and true.

Monday, September 3, 2018
I am your enemy...
Why did you became so close to me?
Wonder you were searching for, to leave me alone?
Even if I fall down, to be broken into pieces,
memories are all I need, to raise up and stand again.
This feeling is a mystical net, that no one can evade getting captured,
a life without this disturbance is not worth living.
This feeling is mystical net, even the tears from your eyes are not yours,
a life without this pain is not worth living...
This feeling that changes me,
This feeling that changes you,
This feeling that can change anything.. oh!! this feeling is devine...
No knives or blood, but still I am your enemy
Has time to spend with you and your togetherness, but still I am your enemy
Subscribe to:
Posts (Atom)