Monday, October 1, 2018

కొన్ని అనుభూతులు ...





కొన్ని అనుభూతుల్లో
కాలం అలా ఆగిపోవాలనీ
ఈ లోకం విడిచి,
ఓ ఏకాంత శిబిరంలోకి
పారిపోవాలనీ ..
ఈ జన్మ... , మరణం లేని
ఆత్మలా మిగిలిపోవాలనీ..
ఆ క్షణం ఒక యుగమవ్వాలనీ..
ఉంటుంది..
దానికి పేరుపెట్టి పిలవటం,
దాన్ని మరోసారి కలవటం జరగదు.
అలా అక్కడ ఆ అనుభూతి
అంతమవ్వాల్సిందే…
మళ్ళా , మళ్ళా ఆ అనుభూతి కోసం
మరెన్నో జన్మలు ఎత్తాల్సిందే…






No comments: