చీకటికి రంగులు వేద్దాం అనుకుంటున్నాను..
కాస్త చిరునవ్వు నవ్వరాదూ..
వేకువకి వెలుగొచ్చేస్తుందేమో...
తొలిఝాములో వొచ్చే కలలు నిజమంటారు..
ప్రతి వేకువలో పక్కనే ఉండే
నువ్వే నా నిజం అయినపుడు..
వేరే కలలు నాకెందుకూ ?
ప్రతి మెలుకువలోనూ
నా కల ఉదయించదా
నీ చిరునవ్వులో
నా బతుకు చిగురించదా ?
No comments:
Post a Comment