Sunday, October 7, 2018

మౌనం తో మాటలాట..

మాటలాడని మౌనం నీది..
మనసు వీడని నీ ధ్యానం నాది..
మాట తీసుకుంటావు,
మౌనం తిరిగి ఇస్తావు..
పోనీ నీ మాటకోసం ఎదురుచూపే
నాకు ప్రాప్తం అనుకుంటే..
చిరునవ్వుతో
నా నిరాశను బతికిస్తావు..
మళ్ళా.. నీ మాటకోసం
నా ఆశ చిగురిస్తుంది..
కళ్ళలో ఆశ ఆరాధనతో
ఎదురుచూస్తుంది..
నువ్వు పలికే పలుకుకోసం..
అందులో ప్రేమ లేకపోయినా..
ప్రేమ లేకపోవటం
లేదేమో అనే ఆరాటంతో..
ఎన్ని యుగాలైనా
ఎదురుచూడాలనే...
అక్కడే చిదిగి శల్యమైపోవాలనే..
ఆరాటం..
నన్ను కదలనీయక..
నీ మాటకోసం
నీ మౌనాన్ని ఆరాధిస్తూ..
ఎదురు చూస్తుంది..

No comments: