ఈమధ్య విన్న పాటల్లో ...
గీతా గోవిందం సినిమాలో రెండు పాటలు
నిజం చెప్పాలంటే ఒక పాట బాగా ఇష్టపడింది : వచ్చిందమ్మా.. పాట . ఈ పాట , మొగుడు సినిమాలో పాట గుర్తుచేస్తుంది. మంచి సాహిత్యం, దానికి తగిన సంగీత, గాత్ర దానం... వెరసి, మంచి అనుభూతినిచ్చే పాట.
ఇంకో పాట, ఇంకేమికేం ఇంకేం కావాలే .. ఈ పాట గాత్రం, సంగీతం బాగున్నా.. సాహిత్యం పూర్తిగా కథాసందర్భోచితం, దానికి వొచ్చిన ప్రజాస్పందన పూర్తిగా అపదృశ్యం.
పాట: ఏఊహాలోనో తలచానేమో ... ఓ వింతలోకం.. చేరానేమో ...
చిత్రం: శివ 2006
సంగీతం: ఇళయరాజా
ఎందుకిష్టం? స్వరాల అమరికపై పేర్చిన పదాల అమరిక బాగుంది...