ప్రేమ అనేది ఒక అబద్దం...
అందులో నిజం వెతుక్కుంటూ ప్రేమిస్తుంటాం
అబద్దం అని తెలిసాక ప్రేమించటం మానేస్తాం..
ద్వేషం కూడా అలానే ఒక అబద్దం..
మనం ద్వేషించే కారణంలో నిజం వెతుక్కుంటూ ఇంకా ద్వేషిస్తాం..
అది నిజం కాదని తెలిసాక ద్వేషించటం మానేస్తాం
ఆరాధన అనేది ఒక నిజం...
ఒకవేళ అందులో అబద్దాన్ని వెతుక్కోవటం మొదలుపెడితే..
ప్రేమించటం మొదలుపెడతాం..
మళ్ళా అది నిజం కాదని తెలిసాక
ప్రేమించటం మానేస్తాం...
అప్పుడు మొదటి ఆరాధన కూడా చచ్చిపోతుంది..