ఈ వారాంతం కూడా ఎప్పటిలాగే..
నా మనోభీష్టానికి
కాస్త కాలాన్ని ప్రసాదించింది..
ఈ మధ్య కాస్త ఎక్కువగా వింటున్న దేవులపల్లి వారి
“గడిచేనటే సఖియా… ఈ రాతిరీ..”
అంటూ ఓలేటివారి స్వర మాధుర్యాన్ని
కాస్త కాస్త గ్రోలుతూ ఉంటే..
అలా మనసు కాస్త చలించి ,
డాక్టర్ ప్రసాద రెడ్డి గారి కిందనున్న లైన్లు
చదివి కాస్త తడిబారి, సుదూరంలో ఉన్న
నా చిన్నారులను, నా కన్నీట నింపింది…
చెడ్డీల నుంచి, చమ్కీల చుడీదార్ల దాకా
పప్పీ షేమ్ల నుంచి పట్టు పావడాలా దాకా..
అవెన్ని వేషాలు మార్చినా…
ఈ నాన్న కన్నుల్లో
తానింకా కుందేలు పిల్లే..
ఈ తండ్రి గుండెల్లో
తానింకా మంచుపూల జల్లే..
No comments:
Post a Comment