ఎప్పుడో చిన్నపుడు జ్ఞాపకాలను రాసుకున్న పాత పుస్తకం,
అప్పుడే కురిసిన వాన చినుకుని ఆలింగనం చేసుకున్న పొడి మట్టి,
అదేమిటో... అందం అనే పదం కోసం వెతకకుండా ప్రతి మనిషికీ నచ్చే పసిపాప నవ్వు,
ఎప్పటికీ జీవమున్న బతుకు గుర్తులు.
ఇదేంటి ఈ గోల, ఉపోద్ఘాతం లేకుండా అంటారేమో...
ఏంలేదు .. ఈ మధ్య తెలుగులో టైపు చెయ్యటం నేర్చుకున్నా (గూగుల్ ఇన్ ఫుట్ టూల్స్ వాడి),
దానితో వాట్సాప్ లోనూ, ఇతరత్రా.. తెలుగు తెగ దంచేస్తున్నాను..
తెలుగులో ఒకసారి మొదలెడితే...
ఇంకా ఎక్కడో దాగున్న మన భాషా ప్రావీణ్యం(అది బాష మీద ఉన్న ఆకలి.. లేదా ఇంకేదన్న అనుకోండి) మొదలౌతుంది..
అందుకే ఎప్పుడో దశాబ్ధం కింద మొదలెట్టిన ఈ బ్లాగ్ ని మళ్ళా వేదికి... ఇలా మళ్ళీ మొదలెట్టాను...
మరిన్ని వివరాలు చేరుస్తాను... కాలం కరుణించినప్పుడల్లా..

No comments:
Post a Comment