Friday, August 31, 2018

అల్లంత దూరంలో నిలిచిపోయిన ఆశ

కాలం ఆగిపోదు నీ చెంతనున్న ఏ క్షణమైనా
సమయం కరిగిపోదు నువు దూరమైన ఏ యుగమైనా
వలపు తలపు మది దోచేస్తూంటే, కనుమరుగైపోయె , నా ఎదురుచూపు నీకోసం.
ప్రపంచం అంచులుదాటి… నీకోసం నను దాటి వెళ్లిన నిరీక్షణా లక్షల క్షణాల గుండా…

చెలీ చేరరావేల .. నా కనురెప్పల మాటున నిదురించి దాగివుంటావేల
నీకోసం నా కలల సవ్వడి వినిపించలేదా? ఇంకిన నా కన్నీటి జాడలు దారి చూపించలేదా?

No comments: