Thursday, August 30, 2018

నిస్తంత్రీ తంత్ర నాదం ....


"ఏంటో... పెరుగన్నం తింటే నిద్ర వొస్తుంది...." ఎదో నిద్రపుచ్చే దేవతని ఆహ్వానిస్తున్నట్టు ..

"అయితే హాయిగా తిని నిద్రపో..." ఎదో తానే ఆ దేవత అయినట్టు ...

"మరీను నువ్వు, తెల్లారే నిద్రపోతే.. పని ఎవరు చేస్తారు?" అదేదో తనకి తెలియనట్టు

"సర్లెద్దూ పని అదే జరుగుతుంది... ఇప్పటికి తిని నిద్రపో..." ఎదో సర్ది చెప్పినట్టు.. కాస్త సముదాయిస్తూ

"సర్లే నువ్వు కలలోకి వొస్తావా.. నిద్రపోతాను...." కాస్త ఆశగా ....

"కలలోకి దెయ్యలొస్తాయి... " గుంభనగా నవ్వుకుంటూ...

"మరీ భయం వేస్తే.. దెయ్యాలకు పౌడర్ రాస్తానులే.. రారాదా?" కాస్త గోముగా.. , "అయినా నీకు తెలీదేమో.. కొన్ని దెయ్యాలు అందంగా కూడా ఉంటాయి... కావాలంటే... కలగని చూడు..." మరింత గేలి చేస్తూ..

"అందమైన దెయ్యాలకోసం కలగంటావా? మరైతే రాకపోతే ఏంచేస్తావ్?" కాస్త కొంటెగా...

"నువ్వే చెప్పావుగా కలలోకి ఒస్తాను  అని.... మళ్ళా  ఇదేంటి?" ముద్దుచేస్తుందేమో అని ఆశగా..

"నేనెప్పుడు చెప్పాను? కలలోకి దెయ్యలొస్తాయని అన్నాను అంతే.. " ఎదో ఎరగనట్టు ....

"మరి అందమైన దెయ్యానివి నువ్వేకదా...?" కళ్ళలోకి చూస్తూ...

ఇంకేం మాటాడలేని మౌనం....

అంతర్జాలం .. గణీకరించిన భయాన్ని అయితే మోసుకుపోగలదు... నిస్తంత్రీ తంత్రనాదం.. వినగలదా ?

No comments: