Wednesday, January 9, 2019

బందీ


కళ్ళు తెరచి చూసినప్పుడల్లా.. నిజం కనిపిస్తుంది..
కళ్ళు కాస్త మూతపడితే ఊహ జనిస్తుంది
ఊహలో నిజం నువ్వైతే
నిజంలోని ఊహను నేను..

నువ్వు గుర్తొచ్చినపుడల్లా.. నేను కవిత రాయకపోవొచ్చేమో కానీ,
నేను కవిత రాసినపుడల్లా… నువ్వు గుర్తొస్తావు..
ప్రేమకు పదాలు పొదిగి నీతో చెప్పాలని వున్నా..

ఆ పదాల పరిమితిలో బందీ అయిపొతుందెమో అని ఆగిపోయాను

No comments: